వ్యవసాయ ప్రయాణం
వ్యవసాయ ప్రయాణం వేల సంవత్సరాలుగా మానవ జీవన శైలిలో ముఖ్యమైనది, ఈ ప్రయాణంలో కష్టపడి పని చేయడం, ప్రకృతితో అనుబంధం పెంచుకోవటం, ఇతరుల కోసం ఆహారాన్ని పండించడంలోనే సంతృప్తిని పొందే గొప్ప జీవనశైలి. అలాంటి రైతుల జీవన శైలిని అందరికి పరిచయం చెయ్యాలి, అలాగే రైతన్నలకు వ్యవసాయంలో వచ్చిన మార్పులను, రాబోయే మార్పులను వారికి తెలియచేస్తూ వారి అనుభవాలను ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నమే నా ప్రయాణం అదే ఈ వ్యవసాయ ప్రయాణం.
వ్యవసాయ యొక్క ప్రయోజనాలు
ప్రకృతితో అనుబంధం :
పంటలు, జంతువులు, పర్యావరణంతో రోజు గడిచిపోతుంది. పొద్దున్నే లేచి పశువుల దగ్గర పనిచేసుకొని, రాత్రి మిగిలిన అన్నాన్ని తిని పొలానికి పశువులను తోలుకొని పొలానికి వెళ్తాడు. పొలంలో పంటను గమనిస్తాడు. కలుపు, పురుగు ఉంటె రేపటి పనిని నిర్ణయించుకొని. ఆ ప్రకృతిలో మధ్యాహ్నం వరకు పనిచేసుకొని పశువులను ఒక పెద్ద చెట్టుకు కట్టేసి ఇంటికి వచ్చి తిని కాసేపు పడుకొని సాయంత్రంగా రేపటి పనికోసం అంటే కలుపు తీయటానికి కూలీలను పిలుస్తడు. లేదా పంటకి పురుగు పడిఉంటే దగ్గరలోని టౌన్ కి వెళ్లి పురుగు మందు తెస్తాడు. మరల పొలానికి వెళ్లి కట్టేసిన పశువులను విప్పి కాసేపు మెప్పి నీళ్లు ఉండే గుంటలో వాదిలి. తరువాత ఇంటికి తోలుకువచ్చి వాటిని పెరట్లో కట్టేసి, కుటుంబంతో కడుపుతాడు.